అధిక దిగుబడిని సాధించి తోటి పొగాకు రైతులకు ఆదర్శప్రాయంగా నిలచిన పొగాకు రైతులకు 22వ టిఐఐ పొగాకు రైతుల అవార్డుల ప్రదానోత్సవం

  • శ్రేష్ఠమైన సాగు విధానాలను ప్రదర్శించిన 15 మంది పొగాకు రైతులకు సన్మానం
  • కార్యక్రామానికి హాజరైన రాజకీయ నాయకులు, పొగాకు పరిశ్రమకు చెందిన ముఖ్యులు మరియు రైతులు
  • సంవత్సరానికి రు.6,500 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్న పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులు
  • భారత ఆర్థిక వ్యవస్థకు సుమారు సాలీనా రు.12లక్షల కోట్లు అందిస్తన్న భారత పొగాకు పరిశ్రమ.
  • భారత సిగరెట్ల మార్కెట్లో ప్రస్తుతం అక్రమ సిగరెట్ల వాటా 1/3వ వంతు
  • సిగరెట్లపై సుస్థిరమైన పన్ను విధానాలు, ఆచరణీయ పొగాకు విధానాలు మరియు అక్రమ సిగరెట్ల వ్యాపారాన్ని ఎదుర్కొనేందుకు దొంగ సిగరెట్లపై కఠిన చర్యలను అమలు చేయడం.

ఒంగోలు 26 అగస్టు 2022:  ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా ప్రాంతాలకు చెందిన పొగాకు సాగులో ఆధునిక సాగు విధానాలను అవలంబించి, అధిక ఉత్పత్తిని సాధించి తోటి పొగాకు రైతులకు ఆదర్శంగా నిలచిన ప్రగతిశీల పొగాకు రైతులకు టొబాకో ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(టిఐఐ)  నేడు 22వ టిఐఐ పొగాకు రైతుల అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించింది. ఈ  కార్యక్రమంలో ఏప్రియల్ 2022న కర్ణాటకలోని హన్సూర్ లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో అవార్డులు అందుకున్న ప్రగతిశీల పొగాకు రైతులు కూడా పాల్గొన్నారు.

22వ టిఐఐ పొగాకు రైతుల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి  పార్లమెంటు సభ్యులు శ్రీ ఎం. శ్రీనివాసులు రెడ్డి గారు, శ్రీ ఎం మహీధర్ రెడ్డి గారు,  Vice Chairman, Tobacco Board, Shri H.C. Basavaraju; Tobacco Members, Shri Mareddy Subrahmanyeswara Reddy, H.R. Dinesh and Shri Podda Varaprasada Rao, గారు  హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో 15 మంది పొగాకు రైతులకు జీవితసాఫల్య పురస్కారం(1), ఉత్తమ రైతు అవార్డు(7), గుర్తింపు అవార్డు(7)లు అను మూడు విభాగాల్లో అవార్డులను అందజేసారు.

ఈ కార్యక్రమంలో టిఐఐ డైరెక్టర్ శ్రీ శరద్ టాండన్ మాట్లాడుతూ “పొగాకు రైతులను నూతన సాగువిధానాలను అందిపుచ్చుకుని దిగుబడులను పెంచుకుని అంతర్జాతీయ విఫణిలో పోటీపడేలా ప్రోత్సహించేందుకు 1999లో ఈ అవార్డులను స్థాపించామని” అన్నారు.

ఆయన మాట్లాడుతూ వాణిజ్య పంటైన పొగాకు సాగు విస్తీర్ణం చాలా తక్కువైనా వ్యవసాయ రంగంలో జీవనోపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ తన వంతుగా భారత కోశాగారానికి సాలీనా సుమారు రు.6,500 కోట్ల మారక ద్రవ్యాన్ని సమకూరుస్తున్నదన్నారు

దేశ వ్యవసాయ సాగు విస్తీర్ణంలో అతి తక్కువ సాగు విస్తీర్ణాన్ని ఆక్రమించినా పొగాకు దేశ ఆర్థిక వ్యవస్థకు గుర్తించదగిన స్థాయిలోనే తన వంతు ద్రవ్యాన్ని ఆర్జించిపెడుతోంది.  అసోచామ్ వారి ఒక అధ్యయన నివేదిక ప్రకారం  పొగాకు పరిశ్రమ  భారత ఆర్థిక వ్యవస్ధకు సుమారు రు. 12లక్షల కోట్లను సమకూర్చింది అని  శ్రీ టాండన్ అన్నారు.

సుమారు 4.6 కోట్ల మందికి జీవనోపాధి కల్పిలస్తున్న ఈ పంట రైతులు, రైతు కూలీలు, బీడీ కార్మికులు, తంబాకు కోసేవారు, వ్యాపారులు వంటి వారి జీవితాలతో ముడిపడి ఉన్నది. కాగా ఇప్పటికే ఈ ప్రాంతాల్లో కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ(సిటిఆర్ఐ) వారు ఏ ఇతర పంట కూడా పొగాకు అంత లాభసాటి కాదని తేల్చిన విషయం మనందరికీ తెలిసిందే. దేశంలో ఉత్పత్తి అవుతున్న పొగాకులో సగం ఎగుమతి అవుతుండగా మిగతా పంటతో దేశీయ సిగరెట్ల తయారీ జరుగుతోంది. చట్టపరమైన సిగరెట్లు(8%) వినియోగం తగ్గడం వల్ల పొగాకు వినియోగం తగ్గిపోతున్నది. కాగా ఎగుమతి అవుతున్న ఎఫ్సివి పొగాకు ఒక్కటే సాలీనా సుమారు రు. 3000 కోట్ల మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నది.

ప్రస్తుతం భారత్ ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న పొగాకులో 13%  పొగాకును ఉత్పత్తి చేస్తున్నప్పటికీ అంతర్జాతీయ పొగాకు ఎగుమతుల వ్యాపారంలో అది 5% మాత్రమే.  ఒక వేళ భారత్ తన పొగాకు ఉత్పత్తి విధాన్నాన్ని సవరించుకున్నట్లైతే తన ఎగుమతులను  మరింత పెంచుకొనవచ్చు. భారత్ తన ఉత్పత్తిలో 50% మాత్రమే ఎగుమతి చేస్తుండగా బ్రెజిల్ మరియు జింబాబ్వేలు తమ ఉత్పత్తిలో 70% నుండి 90% ఎగుమతి చేస్తున్నాయని అంటూ శ్రీ టాండన్ భారత ఆర్థిక వ్యవస్థకు తన వంతు చేయూతనిస్తున్న పొగాకు రంగానికి భారత ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించడానికి సరళీకృత ఎగుమతుల విధానాన్ని అందించాల్సి ఉందని అన్నారు.

గత దశాబ్ద కాలంగా చట్టపరమై సిగరెట్ పరిశ్రమ చట్టపరమైన సిగరెట్ల వినియోగం తీవ్రంగా పడిపోవడం, అక్రమ సిగరెట్ వ్యాపారం విపరీతంగా పుంజుకోవడం వీటి తోడు అధిక పన్ను విధింపులు మరియు కోవిడ్ మహమ్మారి వలన తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నదని టిఐఐ డైరెక్టర్ అన్నారు.

కఠిన నిబంధనలు మరియు అత్యధిక పన్ను విధింపు నకిలీ సిగరెట్ల ఉత్పత్తికి దోహదపడుతోంది. చట్టబద్ధమైన సిగరెట్ల వినియోగం తీవ్రంగా తగ్గిపోయి ఆ మేర చవకైన అక్రమ, దొంగ రవాణా సిగరెట్ల వ్యాపారం పెరగడానికి కారణమవుతోంది. పరిశ్రమ ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న అతిచవకైన అక్రమ సిగరెట్ల సమస్య, చట్టపరమైన సిగరెట్లపై కఠిన నిబంధనలు, అధిక పన్నులు సరేసరి. ప్రస్తుతం  దేశంలో పొగాకుపై అమలు చేస్తున్న కఠిన నిబంధనలు అమెరికా, చైనా, జింబాబ్వే, మలావి వంటి దేశాలతో పోలిస్తే చాలా కఠినం. పొగాకు ఉత్పత్తి చేస్తున్న దేశాలైన అమెరికా, చైనా, జపాన్ వంటివి ప్రపంచ ఉత్పత్తిలో 50% వినియోగిస్తున్నాయి. కానీ అక్కడ నిబంధనలు అంత కఠినం కావు. కాగా భారత్లో మాత్రం 85%  చిత్రసహిత హెచ్చరికలను విధిస్తూ నిబంధనల్లో ప్రపంచంలోనే 8వ స్థానంలో నిలచింది. అంతర్జాతీయంగా చూస్తే చిత్ర సహిత హెచ్చరికలు 45% కంటే తక్కువగానే ఉన్నాయి.

అక్రమంగా రవాణా అయిన అంతర్జాతీయ సిగరెట్ల పెట్టెలపై ఎటువంటి హానికారక హెచ్చరికలు ఉండకపోగా మరింత ఆకర్షణీయంగా ఉండి వినియోగదారులను ఆకర్షిస్తూ వారి ఆరోగ్యానికి చేటును చేస్తూండడంతోపాటు దేశీయ సిగరెట్ల పరిశ్రమకు తీరని నష్టాన్ని చేకూరుస్తున్నాయి. చిత్ర సహిత హెచ్చరికలు పెద్దగా ఉండడంతో దేశీయ  సిగరెట్లను కొనడానికి వినియోగదారులు సంశయించి చవకైన అక్రమ సిగరెట్ల వైపు మొగ్గుచూపుతున్నారని టిఐఐ డైరెక్టర్ శ్రీ శరద్ టాండన్ అన్నారు.

2010లో చట్టపరమైన సిగరెట్లపై విధించిన అధిక పన్నుల వలన ప్రపంచంలోనే  సిగరెట్లపై  అత్యధిక పన్నును భారత  ప్రభుత్వం విధించడం వలన అవి వినియోగదారునికి అందుబాటు ధరలో లేక వారు కొనలేకపోతున్నారు. భారత్లో సిగరెట్లపై విధించిన పన్నుతలసరి జిడిపి శాతం ప్రపంచంలోనే అత్యథికం.

కాగా మరోవైపు అక్రమ సిగరెట్ల వినియోగం బాగా పెరిగింది. అధిక పన్ను విధింపు వంటి కారణాల వలన అక్రమ సిగరెట్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా దినదినాభివృద్ధి చెంది భారతదేశం అక్రమ సిగరెట్ల వ్యాపారంలో ప్రస్తుతం 4వ స్థానంలో కొనసాగుతోంది. ఈ కారణంగా భారత ప్రభుత్వం ఏటా రు.15,000 కోట్ల వరకు నష్టపోతోంది. భారత సిగరెట్ల మార్కెట్లో ప్రస్తుతం 1/3వ వంతు ఈ అక్రమ సిగరెట్లే ఉన్నాయి.  ఈ కారణంగా భారత ప్రభుత్వం, చట్టబద్థమైన సిగరెట్ల పరిశ్రమతోపాటు దేశీయ పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఈ అక్రమ సిగరెట్లలో దేశీయ  ఎఫ్సివి పొగాకు వినియోగించకపోవడం వలన దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 2013-14లో 316మి.కి ఉన్న పొగాకు సాగు పరిమాణం గత ఐదు సంవత్సరాల్లో 215 మి.కిలకు పడిపోయిందది. ఇందువలన  ఒక అంచనా ప్రకారం సుమారు 35 మిలియన్ రోజుల ఉపాధిని  కోల్పోవడం రైతుల ఆదాయానికి గండిపడటాన్ని సూచిస్తుంది.ఈ పరిస్థితులు దేశీయ ఎఫ్సివి పొగాకు రైతుల  ఆదాయంపై, జీవనోపాధిపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.

అంటే దేశంలోని ఎఫ్సివి పొగాకు రైతుల భవితవ్యం అంతర్గతంగా చట్టపరమైన దేశీయ సిగరెట్ల తయారీ పరిశ్రమపై ఆధారపడి ఉంది. ఎఫ్సివి పొగాకుపై సంతులిత నిబంధనలు మరియు పన్ను విధింపు దేశీయ ఎఫ్సివి పొగాకు రైతుల జీవనానికి దోహదపడుతుంది. దేశీయంగా పొగాకుకు ఉన్న డిమాండు కూడా నాణ్యమైన పొగాకు పండించడానికి రైతును ప్రోత్సహించడమేకాక అంతర్జాతీయ విఫణిలో హెచ్చుతగ్గుల నుండి దేశీయ రైతును కాపాడుతుంది.

దేశీయ  పొగాకు రంగంలో ఉన్న సామాజిక-ఆర్ధిక ప్రాముఖ్యతను, లక్షలాది  పొగాకు రైతుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుని సంతులిత విధానాలను రూపొందించడం మన విధానకర్తల కర్తవ్యం. భారత దేశంలో ఆర్థిక-సామాజి ప్రాధాన్యం దృష్ట్యా, ప్రత్యేకించి ఈ పొగాకు రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది రైతులు మరియు సంబంధిత ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విధాన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం మన విధాన కర్తలపై ఎంతైనా ఉంది. అక్రమ సిగరెట్లపై ఉక్కుపాదం మోపడానికి సుస్థిర విధానం అమలుతోపాటు  సిగరెట్లపై స్థిరమైన ఆచరణాత్మక పన్ను విధానాలు ప్రభుత్వానికి మరింత ఆదాయాన్ని ఆర్జించిపెట్టడమేకాక భారత  పొగాకు రైతుల జీవనోపాధినీ రక్షిస్తుందనడంలో సందేహం  లేదు అని శ్రీ శరద్ టాండన్ అన్నారు. яндекс

ఈ కార్యక్రమంలో టిఐఐ పొగాకు రైతులను ప్రోత్సహించడానికి ఈ అవార్డులు ప్రవేశపెట్టి 21 సంత్సరాలు పూర్తయిన సందర్భంగా  మొదటి నుండి ప్రగతిశీల పొగాకు రైతుల ప్రయాణాన్ని వివరిస్తూ ఒక కాఫీ టేబుల్ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు.

టిఐఐ అవార్డుల గురించి…

ప్ల్యూ క్యూర్డ్ వర్జీనియా(ఎఫ్సివి) పొగాకు రైతులను ప్రోత్సహించడానికి, పొగాకు ఉత్పత్తిలో ఆధునిక, శాస్త్రీయ సాగు పద్ధతులను అనుసరించి ఉత్తమ నాణ్యత మరియు దిగుబడులు సాధించిన ప్రగతిశీల రైతులను గుర్తించి వారిని అభినందించడానికి టొబాకో ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(టిఐఐ) వారు 1999లో  ఈ టిఐఐ పొగాకు రైతుల అవార్డులను ఏర్పాటు చేసారు. దేశీయ పొగాకు రంగంలో మెరుగైన దిగుబడి, ఉత్పత్తి, నాణ్యత మరియు అంతర్జాతీయ పోటీ పెంచడానికి రైతులు ప్రస్తుతం ఆధునిక  సాగు విధానాలను అవలంబించినందుకు అభినందన పూర్వకంగా ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు.

ఈ అవార్డుల ప్రదానం రైతుల్లో పోటీ తత్వం పెరిగి మంచి ఫలితాలను సాధిస్తున్నందు వలన 2009 నుంచి ఈ అవార్డులను ఎయిర్-క్యూర్డ్ రకం పొగాకుకు కూడా అందిస్తున్నారు.

ప్రతీ సంవత్సరం జరిగే ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం పొగాకు రంగానికి చెందిన వివిధ వాటాదారులు, భాగస్వాములు అందరూ ఒక చోట చేరి ఈ రంగంలో ప్రస్తుతం వారికి అవసరమైన విషయాలను ప్రత్యేకించి నూతన సాగు విధానాలు మరియు విధానాల రూపకల్పనల గురించి చర్చించుకునేందుకు ఒక మంచి వేదికగా నిలుస్తోంది.